ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు పై వైసీపీ నిరసన

2018-06-21 366

Amid the furore growing day by day for the set up of steel plant in Kadapa district of Andhra Pradesh,the Oppoistion YSRCP had called for a state wide on 29th of this month. YSRCP demanded the centre to immediately set up the steel plant that was promised in the bifurcation bill.

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి ఏపీ ప్రతిపక్ష పార్టీలు . ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఈ నెల 29న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. కడప ఉక్కు రాష్ట్ర హక్కు అనే నినాదంతో ఉక్కు పరిశ్రమ సాధించి తీరుతామని వైసీపీ తెలిపింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం రాజకీయంగా వేడిని రాజేస్తోంది. విభజన బిల్లులో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేస్తామని పొందుపర్చి ఉంది. 2014 తర్వాత కొంతకాలం పాటు బీజేపీతో సఖ్యతగా ఉన్న టీడీపీ ప్రభుత్వం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని విస్మరించిందని వైసీపీ ఆరోపించింది. అప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యంకాదని నివేదిక పంపిన ఏపీ సర్కార్....
బీజేపీతో తెగదెంపుల తర్వాత ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు దొంగదీక్షలు చేస్తున్నారని వైసీపీ ధ్వజమెత్తింది. ఇప్పటికే టీడీపీ వైసీపీ నేతలు ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్షలు చేస్తుండగా... కమ్యూనిస్టులు ఉక్కుఫ్యాక్టరీ కోసం ఢిల్లీలో ధర్నా చేపడతామని ప్రకటించారు

Videos similaires