సందేశాత్మక ట్వీట్లతో మెప్పిస్తున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

2018-06-21 669

'Who said there are no shortcuts in life? Gotta love this smart kid. and the teacher is equally smart it appears' Telangana Minister KTR tweet.
#KTR

సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చురుగ్గా ఉంటారు. తాను పాల్గొనే కార్యక్రమాలు, ప్రభుత్వానికి చెందిన అంశాలను సోషల్ మీడియాలో పెడుతుంటారు. గురవారం కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. 'జీవితంలో షార్ట్ కట్ లేదని ఎవరు చెప్పారు? ఈ కిడ్ చాలా స్మార్ట్, టీచర్ కూడా అంతే స్మార్ట్‌గా కనిపిస్తున్నారు' అని ఓ పోస్ట్ పెట్టారు.
ఆకలితో ఉన్న పిల్లి పాలు తాగడానికి దారి చూపండి అంటూ ఉన్న ఓ పజిల్‌ను టీచర్ ఓ విద్యార్థికి ఇవ్వగా, అతను ఇచ్చిన సమాధానానికి సంబంధించిన పోస్ట్ అది. టీచర్ ఇచ్చిన ఆ పజిల్‌కు విద్యార్థి పక్కదారిలో పాలు తాగుతున్నట్లుగా సమాధానం ఇచ్చాడు. దానికి టీచర్ కూడా రైట్ (ఒప్పు) వేసింది. ఇది వారం రోజుల క్రితం టీచర్ దిద్దినట్లుగా తేదీని బట్టి తెలుసుకోవచ్చు. దీనిని పోస్ట్ చేసిన కేటీఆర్ జీవితంలో షార్ట్ కట్ లేదని ఎవరు అన్నారని పేర్కోన్నారు.

Free Traffic Exchange