Jamba Lakidi Pamba Hero Srinivas Reddy Press Meet

2018-06-20 2,837

The first look poster of Srinivas Reddy starrer Jamba Lakidi Pamba was released today by actor Naresh Vijaya Krishna. In an event held Sarathi Studios, the poster was unveiled in the presence of actor Ali and director Maruthi Dasari. The cast and crew of the film were also present.

జయమ్ము నిశ్చయంబు రా, ఆనందో బ్రహ్మ చిత్రాలు సాధించిన విజయాల తర్వాత హీరోగా ప్రస్తుతం జంబలకిడి పంబలో నటిస్తున్నాను. గత చిత్రాల్లో కథ నచ్చడంతోనే హీరోగా చేశాను. ఈ సినిమాలో కూడా దర్శకుడు చెప్పిన స్టోరి కారణంగానే ఈ చిత్రంలో నటించాను. ఇంట్లో నైటీలు వేసుకొని మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాను. మన ఇంట్లోకి కొత్త వ్యక్తి వచ్చారంటూ నా కూతురు కూడా చాలా గమ్మత్తుగా కామెంట్ చేసింది.
ఆడ వేషంలో నటించడం కొత్త అనుభూతి. ఈ చిత్రానికి ముందు నరేష్ నటించిన జంబలకిడి పంబ, చిరంజీవి నటించిన చంటబ్బాయ్ చిత్రాలను చూశాను. . తొలిరోజు నేను ఓ సీన్ చేసినప్పుడు ఎవరూ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు. దాంతో వారికి నచ్చలేదని మరో షాట్ ట్రై చేద్దామని అనగానే సూపర్ అంటూ చిత్ర యూనిట్ ప్రశంసించింది.
పాత జంబలకిడి పంబ చిత్రంలో ఓ ఊరులోని ప్రజలంతా అంటే ఆడవాళ్లు మగవాళ్లుగా.. మగవాళ్లు.. ఆడవాళ్లుగా మారిపోతారు. కానీ ఈ చిత్రంలో జంబలకిడి పంబ అనే మంత్రం ద్వారా నేను, హీరోయిన్ మాత్రమే మారిపోతాం. హీరోయిన్ సిద్ది ఇద్నానీ కూడా బాగా నటించింది. ఈ సినిమాకు ఆమె నటన హైలెట్ అని చెప్పవచ్చు.
మహిళల జీవితం అంటే చాలా కష్టమైనవి. వారు అనుభవించే కష్టాలు ప్రేక్షకుల దృష్టికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాం. ఆ క్రమంలోనే మహిళలు రుతుస్రావం సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించాం. ఈ చిత్రంలో మహిళ పాత్రలో నటించడం ద్వారా వారిపై మరింత గౌరవం పెరిగింది.