Varun Tej Launches Shriya, Niharika's Movie

2018-06-20 70

Shriya Saran new movie launched. Niharika playing key role in this movie.

స్టార్ హీరోయిన్ శ్రీయ శరన్ కొత్త చిత్రం ప్రారంభమైంది. చాలా కాలం సౌత్ లో స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన శ్రీయ ఇప్పుడు ఆచి తూచి మాత్రమే సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించబోయే లేడి ఓరియెంటెడ్ చిత్రం నేడు ప్రారంభమైంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రం మెగా హీరోయిన్ నిహారిక కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.
డెబ్యూ దర్శకురాలు సుజనా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ కూడా ప్రారంభోత్సవానికి అతిధిగా హాజరయ్యాడు. జ్ఙానశేఖర్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం ఓ వైవిధ్యభరితమైన కథతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీయ చివరగా గాయత్రీ, పైసా వసూల్ వంటి చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో శ్రీయ ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా ఒకే చెబుతోంది. శ్రీయ, నిహారిక పాత్రలు ఈ చిత్రంలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.