Bangari Balaraju Movie Audio Launch Event

2018-06-20 36

Director Kotendra Dudyala's 'Bangari Balaraju' has been completed and the film is getting ready to hit the screens in this summer. producer dil raju released the movie songs.
#BangariBalaraju

బంగారి బాలరాజు చిత్రం ఆడియోలోని మొదటి మూడు పాటలను నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు అశ్వనీదత్, అనిల్ సుంకర విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లోని మరోపాట 'నా కొంగులో నా గుండెలో....' అంటూ సాగే సాంగ్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీదుగా విడుదల చేశారు.
కొత్తవారితో తెరకెక్కిన బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచిపేరు తీసుకురావాలని మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి నాయకులు బిజ్జం పార్ధసారధి రెడ్డి గారు మాట్లాడుతూ... బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించాలని హీరో, దర్శక నిర్మాతలకు విషెస్ అందించారు.
అంతా కొత్తవారితో చక్కని ప్రేమకధా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రజలందరికి బాగా నచ్చుతుందని, దర్శకనిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ చిత్రంలోని ఈ చక్కటి పాటను నా చేతుల మీదుగా రిలీజ్ కావడం అనందంగా ఉందని తెలిపారు.
చిన్నసినిమాకి పెద్దమనసు తో బంగారి బాలరాజు సినిమాలోని నా కొంగులో నా గుండెలో అనే పాటను విడుదల చేసి మా టీం కు బ్లెస్సింగ్స్ అందించండం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్బంగా దిల్ రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత కె.యమ్ డి. రఫి మాట్లాడుతూ... "బంగారి బాలరాజు సినిమా లోని మంచి ఫీల్ తో సాగే ఈ పాటను దిల్ రాజు గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘అలాగే ఈ చిత్రంలోని ‘ఏమి కళ్లురో మామ'... అనే పాటను మా వెల్ విషర్, టిడిపి నాయకులు బిజ్జం పార్ధసారధి రెడ్డి అన్నగారు, మరియు ‘చెలియా నీ కోసం'.... అంటూ సాగే పాటను ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖా మంత్రి భూమా అఖిలప్రియ చేతుల మీదుగా విడుదల కావడం జరిగింది. అతిరధమహారధులు మా చిత్రంలోని పాటలను విడుదల చేసి వారి ఆశీస్సులను అందించడం మా చిత్ర యూనిట్ కు మరెంతో ఉత్సాహాన్ని కలిగించింది. మా తరుపున, మా యూనిట్ తరుపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.