పవన్ పై నిప్పులు చెరిగిన ఎంపీ టీజీ వెంకటేష్

2018-06-20 678

Telugudesam party Rajya Sabha Member TG Venkatesh on Wednesday told why Jana Sena cheif Pawan Kalyan is ready to contest in next general elections.
#janasena
#tgvenkatesh


ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలుగుదేశం పార్టీ బలపడుతుందనే భయంతోనే ఇవ్వడం లేదని ఎంపీ టీజీ వెంకటేష్ బుధవారం కేంద్రంపై మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ విధానాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు.
ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్యవస్థ బాగా దెబ్బతిన్నదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీల్చే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని టీజీ వెంకటేష్ చెప్పారు.
చంద్రబాబు పాలనలో జనానికి ఒరిగింది ఏమీ లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. పోలవరం పనుల్లో తెరవెనుక ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. పోలవరం పనుల్లో తెరవెనుక చాలా జరిగిందన్నారు.
వాంబే గృహాల్లో భారీ అవినీతి జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. ఇళ్ల పేరుతో 30వేల కోట్లకు పైగా దోచుకున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఏ డిపార్టుమెంటులో చూసినా అవినీతిరాజ్యమేలుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లేకుంటే చంద్రబాబు జీరో అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. వాటిని పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నారన్నారు.

Videos similaires