నిర్మల్ జిల్లా ఘటన పై పవన్ కళ్యాణ్ స్పందన

2018-06-18 407

నిర్మల్ జిల్లాలో జరిగిన పదేళ్ల బాలిక అత్యాచారం, హత్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం స్పందించారు. బాలిక అత్యాచారం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి తగిన న్యాయం చేయాలన్నారు. బాలికలు, యువతులపై అత్యాచారానికి ఒడిగట్టే మానవ మృగాలను బహిరంగంగా శిక్షించాలని పవన్ డిమాండ్ చేశారు. ఫోక్సో చట్టం అమలులో లోపాలు లేకుండా చూడాలన్నారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడే వారికి బహిరంగంగా శిక్ష వేస్తేనే నిందితుల్లో భయం పుడుతుందన్నారు.
Jana Sena chief Pawan Kalyan responds on Nirmal district case.
#PawanKalyan
#JanaSena