Music director Manisharma about Mahesh Babu. He gives clarity on Clash with Mahesh
స్వరబ్రహ్మగా పేరుగాంచిన మణిశర్మ స్టార్ హీరోలందరికీ అదిరిపోయే మ్యూజికల్ హిట్స్ అందించారు. ఆయన స్వరపరచిన పాటలు ఇప్పటికి ఎక్కడోచోట వినిపిస్తూనే ఉంటాయి. దశాబ్దకాలం పైగా టాలీవుడ్ లో మణిశర్మ తిరుగులేని సంగీత దర్శకుడిగా రాణించారు. కానీ ఇటీవల ఆయన ప్రభావం బాగా తగ్గింది. టాలీవుడ్ లో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ ఇలా స్టార్ హీరోలందరికీ మణిశర్మ సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ అందించారు. మహేష్, తనకు మధ్య జరిగిన వివాదం గురించి మణిశర్మ తాజాగా ఓ ఇంటర్వూస్ లోఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఒకప్పుడు మణిశర్మ లేకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమా చేసేవారు కాదంటే అతిశయోక్తి కాదేమో. మణిశర్మ మ్యూజిక్ తోనే సినిమాలకు సగం హైప్ వచ్చేవి.
ట్రెండు మారడంతో మణిశర్మ ప్రభావం క్రమంగా టాలీవుడ్ లో తగ్గిపోయింది. తెలుగు స్టార్ హీరోలు కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు. ఠాగూర్, ఇంద్ర, నరసింహ నాయుడు, పోకిరి, ఖుషి, ప్రేమించుకుందాం రా వంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి.
మహేష్ కెరీర్ ఆరంభం నుంచి ఆయన సినిమాలకు సంగీతం అందించాను. మేమిద్దరం మంచి సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళం. కానీ ఎక్కడో చిన్న మనస్పర్థలు వచ్చాయి. మహేష్ భాదపడ్డట్లు ఉన్నాడు. కానీ విషయం ఏంటో నాకు తెలియదు అని మణిశర్మ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.