పవన్ ,జగన్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

2018-06-18 1,286

Former MP Undavalli Arun Kumar said that now YSRCP chief YS Jagan Mohan Reddy wave in Andhra Pradesh, But AP CM Nara Chandrababu Naidu can change.
#ChandrababuNaidu
#MPUndavalliArunKumar

ఇప్పుడు ఎన్నికలు వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ వైపు వేవ్ ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం అన్నారు. అయితే, ఈ వేవ్‌ను మార్చగలిగే శక్తి టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉందని తెలిపారు. జగన్‌కు సరైన ఎన్నికల బృందం లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో అయిదారేళ్లు పట్టవచ్చునని చెప్పారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. పవన్ ఇప్పుడే పూర్తిస్థాయి రాజకీయ ఆరంగేట్రం చేశారని, కాబట్టి ఆయన బలంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని చెప్పారు. ఆయన బలం ఏమిటో ముందు ముందు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. నిధుల గురించి జనసేన ఇచ్చిన రిపోర్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడు మండలాలను విలీనం చేసినప్పుడే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పట్టుబట్టాల్సింది అని ఉండవల్లి చెప్పారు. ఇప్పుడు చాలా ఆలస్యమైందని అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరేది లేదని తేల్చి చెప్పారు.

Free Traffic Exchange

Videos similaires