అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారంలో భయంకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హీరోయిన్లను వ్యభిచారంలోకి దించారనే ఆరోపణలపై తెలుగు నిర్మాత, ఎన్నారై వ్యాపారవేత్త మొదుగుమిడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, అతని భార్య చంద్రకళ అరెస్ట్‌తో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఓ పక్క క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై శ్రీరెడ్డి రేపిన దుమారం సద్దుమణుగుతుండగా యూఎస్ సెక్స్ రాకెట్ బయటపడటం టాలీవుడ్ ప్రతిష్ట మసకబారే పరిస్థితి తలెత్తింది. అమెరికాలోని సెక్స్ రాకెట్ వ్యవహారంపై నటి శ్రీరెడ్డి, యాంకర్ అనసూయ, మా అధ్యక్షుడు శివాజీ రాజా తదితరులు స్పందించారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు మహిళా సినీ ప్రముఖులు నోరు విప్పారు.
అమెరికాలో సాంస్కృతిక ఈవెంట్ల పేరుతో కొందరు సినీ తారలను సంప్రదించడం చాలా సాధారణంగా జరుగుతున్నది. అమెరికాకు సినీ తారలు వెళ్లడం కొత్తేమీ కాదు. టాలీవుడ్‌లో చిన్నాచితకా సీ లేదా డీ గ్రేడ్ ఆర్టిస్టులను కొందరు ఈవెంట్ల నిర్వాహకులు తీసుకెళ్లడం జరుగుతుంటుంది. అలాంటి వారినే ఇలాంటి వ్యవహారంలోకి లాగుతుంటారు అని సినీ నటి సంజన వెల్లడించింది.
ఈవెంట్లలో డ్యాన్సులు, స్కిట్స్ వేయడం కోసం ఆహ్వానిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపి బలవంతంగా వ్యభిచారం చేయిస్తుంటారు. కొందరు మాత్రం డబ్బు కోసం తమ అంగీకారంతో ఇలాంటి పనులకు ఒప్పకొంటారు అని సంజన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.