Fifa World Cup 2018 : Cristiano Ronaldo Makes A Record

2018-06-18 1

The Real Madrid star ace later scored thrice to salvage a draw for his team as the match ended 3-3. The statistics only took into account World Cups, European Championships and Copa Americas, but the tournament like African Cup of Nations were not taken into consideration. And after the game when fans and supporters were busy discussing records of the Portuguese top scorer, Ghanaian star Asamoah Gyan took to Twitter to show his anger about the goal-scoring record as the forward openly refuted the feat and insisted that he already had broken that record by scoring in nine consecutive tournaments.

ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి సోచీ నగరంలోని షిష్ట్ స్టేడియంలో పోర్చుగల్, స్పెయిన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మూడు గోల్స్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇరు జట్లు చెరో మూడు గోల్స్ చేయడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
అయితే, ఈ మ్యాచ్ పుట్ బాల్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. స్పెయిన్‌పై పోర్చుగల్ కెప్టెన్ రోనాల్డో హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు.
స్పెయిన్‌ ఆటగాడు డిగో కోస్టా 24వ నిమిషంలో గోల్‌ చేసి మ్యాచ్‌ను సమం చేశాడు. ఈ క్రమంలో రొనాల్డో మరింత దూకుడు ప్రదర్శించి 44వ నిమిషంలో మరో గోల్‌ అందించి మ్యాచ్‌ను 2-1 ఆధిక్యంలో తీసుకెళ్లాడు. అనంతరం 55వ నిమిషంలో స్పెయిన్‌ ఆటగాడు డిగో కోస్టా మరోసారి గోల్‌తో మెరిపించాడు.
ఆ తర్వాత నాచో 58వ నిమిషంలో గోల్‌ అందించి స్పెయిన్‌ ఆధిక్యాన్ని 3-2కు పెంచాడు. మరికొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో రోనాల్డో చెలరేగిపోయాడు. 88వ నిమిషంలో ఫ్రీ కిక్‌తో గోల్ చేసి మ్యాచ్‌ను సమం చేశాడు. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగియడంతో పాటు స్పెయిన్ ఆశలపై నీళ్లు చల్లాడు.
పోర్చుగల్‌ తరఫున 8వ నిమిషంలోనే తొలి గోల్‌ కొట్టిన రొనాల్డో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో వరుసగా నాలుగు వరల్డ్‌కప్‌లలో హ్యాట్రిక్ గోల్‌ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో(2006, 2010, 2014, 2018) చేరాడు. వరుసగా నాలుగు వరల్డ్‌కప్‌లలో హ్యాట్రిక్ గోల్‌ కొట్టిన ఘనత ఇప్పటివరకూ ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు.