NTR shared his second child pic via Instagram. Young Tiger Jr NTR and wife Lakshmi Pranathi welcomed their second child recently(june 14). Jr NTR took to social media and made the announcement about the arrival of the bundle of joy in their family and fans of the young tiger were much elated.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి దంపతులు జూన్ 14న రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటో కొన్ని నిమిషాల్లోనే నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు ఈ ఫోటో చూసి తెగ మురిసిపోతున్నారు.
ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఫోటోలో తమ్ముడిని అభయ్ రామ్ ఎత్తుకుని ఉండగా..... ఎన్టీఆర్ ఆ ఇద్దరి ఫోటోను తన సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. ఈ ఫోటో ఎంతో చూడముచ్చటగా ఉందని అభిమానులు అంటున్నారు.
రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ కొడుకు ఇతడే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయంది. అయితే ఈ ఫోటో నిజమైందా? కాదా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఆ ఫోటో తన కుమారుడిది కాదని ఎన్టీఆర్ నుండి ఎలాంటి ఖండన రాలేదు కాబట్టి అంతా నిజమే అని అనుకుంటున్నారు.