TDP MP CM Ramesh said that the he would soon launch an indefinite fast on the Kadapa steel plant issue. He said that he had sought an appointment with Prime Minister Narendra Modi on June 17 or 18 to submit a petition on the issue.
#TDP
#Kadapasteelplant
కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలం ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని, ఆ తర్వాత 24వ తేదీ నుంచి తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ శుక్రవారం చెప్పారు. తాము కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. ప్రధాని మోడీని కలిసి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. ఆయన స్పందించకుంటే మాత్రం ఆమరణ దీక్షకు దిగుతానని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం పాత నివేదికతో సుప్రీం కోర్టు అఫిడవిట్ ఇచ్చిందని ఆరోపించారు.
అంతకుముందు, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో బీజేపీ, వైసీపీ ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించిన వివరాలు అంటూ కొన్ని విషయాలను మీడియాకు విడుదల చేశారు. అయితే, ఆకుల సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు అదే విషయం చెప్పారు. ఇందుకు సంబంధించి టీడీపీ ఎంపీలు కారు లాగ్ బుక్ వివరాలు, వీడియో ఫుటేజీని విడుదల చేశారు. మరిన్ని వివరాలు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమని టీడీపీ ఎంపీలు ప్రకటించారు. రాజీనామా పేరుతో వైసీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. ఢిల్లీలో జరగనున్న నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు విభజన హామీలను ప్రస్తావిస్తారని తెలిపారు. పార్లమెంటు లోపలే కాకుండా బయట కూడా ఉద్యమిస్తామన్నారు.