The World Cup was ushered in on Thursday after a short ceremony that featured the unlikely duo of British pop star Robbie Williams and Russian president Vladimir Putin.
గెలుపు కోసం ఎనిమిది నెలల తరబడి సాగుతున్న రష్యా నిరీక్షణ ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌తో తీరింది. గురువారం ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో అతి తక్కువ ర్యాంకు(70)తో బరిలోకి దిగిన ఆతిథ్య రష్యా తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది.
మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో గురువారం సౌదీ అరేబియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా జట్టు 5-0 తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో మైదానంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఎటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కొన్న రష్యా జట్టు మ్యాచ్ ఆద్యంతం అదే జోరుతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బంతిని ఎక్కువ సమయం ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ సౌదీ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేక పోయింది. రష్యా తరఫున చెరిషెవ్ రెండు గోల్స్ కొట్టగా, గజిన్‌స్కి, జుబా, గోలోవిన్ తలో గోల్ సాధించారు.