2018 FIFA World Cup : Football Opening Ceremony

2018-06-15 1

The 2018 FIFA World Cup is just a week way and with preparations almost done, the greatest players on the planet are set to take center stage in Russia.

ప్రపంచంలో అతి పెద్ద క్రీడా మహోత్సవానికి తెర లేచింది. రష్యా ఘన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ 21వ ఫిఫా వరల్డ్‌కప్‌ ఆరంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. రష్యా రాజధాని మాస్కోలని లుజ్నికి స్టేడియంలో స్పేష్ షిఫ్‌తో ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి.
అనంతరం బ్రెజిల్ పుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ మస్కట్ వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. బ్రిటిష్‌ పాప్‌స్టార్‌ రాబీ విలియమ్స్‌ తన ఆట పాటలతో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ కార్యక్రమంలో రాబీతో పాటు రష్యన్ స్పొరానో ఐదా గారిఫుల్లీనా కూడా పాటులు పాడింది. బ్రెజిలియన్‌ గ్రేట్‌ రోనాల్డో, విల్‌ స్మిత్‌, నిక్కీ జామ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రష్యా దేశ చరిత్ర, సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాటు చేసిన సెట్టింగులు, కళాకారుల పాటలు, నృత్య ప్రదర్శనలు, బాణసంచా అదరహో అనిపించాయి. దేశవిదేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు, అతిరథ మహారథులు, అభిమానులతో స్టేడియం హోరెత్తిపోయింది. లుజ్నికి స్టేడియంలో పాటలు, నృత్యాలతో అభిమానులను అలరించారు.
మరోవైపు దీనికి సమాంతరంగా మాస్కో నగరంలోని ప్రఖ్యాత రెడ్‌ స్క్వేర్‌లో నిర్వహించిన సంగీత విభావరి అభిమానులను ఆకట్టుకుంటుంది. 80 వేల ప్రేక్షక సామర్థ్యమున్న లుజ్నికి స్టేడియంలో దాదాపు 500 మంది నృత్యకారులు, జిమ్నాస్ట్‌లు, ట్రాంపోలినిస్ట్‌లు ఈ ఆరంభ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చారు.