చంద్రబాబు నాయుడు పై మండి పడ్డ ఒమర్

2018-06-14 382

Alliance with people" will be the Congress' new slogan as it focuses on strengthening the party in Andhra Pradesh, AICC general secretary Oommen Chandy said.
#Congress

వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోమని, ఆ ప్రశ్నే లేదని, తాము ప్రజలతో పొత్తు పెట్టుకుంటామని, ఇదే 2019 ఎన్నికలకు తమ నినాదం అని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాంది అన్నారు. తాము ఒంటరిగానే వెళ్తామని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటరి పోరు తమకు సవాలేనని, కానీ తాము ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ఏపీలో పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు ఇంటింటికి తిరుగుతామని చెప్పారు. నాలుగేళ్ల పాటు బీజేపీ, టీడీపీలు కలిసి ఉండి ఇప్పుడు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.
పార్టీలతో కాదు ప్రజలతోనే మా పొత్తు.. ఇదే 2019కి తమ నినాదమని ఊమెన్ చాందీ చెప్పారు. దాదాపు నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రంపై ఒత్తిడి చేయలేదని విమర్శించారు. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్సే దోషి, ఆ పార్టీ వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ మాట్లాడుతున్నారన్నారు. కాగా, గత కొన్నాళ్లుగా చంద్రబాబు - కాంగ్రెస్ కలుస్తారని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే టీడీపీ తేల్చేసింది. ఇప్పుడు ఊమెన్ చాందీ కూడా ఏ పార్టీతోను కలవమని స్పష్టం చేశారు. ఊమెన్ చాందీ వ్యాఖ్యలు టీడీపీకి కూడా ఊరట అని చెప్పవచ్చు.
బీజేపీ అన్ని విషయాల్లోనూ మోసం చేస్తోందని ఊమెన్ చాందీ మండిపడ్డారు. ప్రజల్లో ఎంతో అసంతృప్తి నెలకొందన్నారు. వారు మార్పు కోసం చూస్తున్నారన్నారు. అంతకుముందు, ఊమెన్ చాందీ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఏపీసీసీ కార్యవర్గ సమావేశం వాడిగా, వేడిగా జరిగింది. పార్టీ బలోపేతానికి సహకరించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.

Videos similaires