కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో టాలీవుడ్లో సంచలనం క్రియేట్ చేసిన శ్రీరెడ్డి కొన్ని రోజులుగా హీరో నానిపై ఆరోపణలు చేస్తూ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నాని తనను సెక్సువల్‌గా వాడుకున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని కూడా శ్రీరెడ్డి ఆరోపణలకు రియాక్ట్ అవ్వడం, ఆమెకు లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే నాని లీగల్ నోటీసులు పంపే సమయానికే శ్రీరెడ్డి తన పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు కేరళ వెళ్లింది. మూడు రోజులుగా ఆమె కేరళలోని అలప్పీలో గడుపుతోంది.