ప్రముఖ స్టార్ హీరో రేప్ చేశాడంటూ కేసు పెట్టిన మహిళా అభిమాని

2018-06-14 406

హాలీవుడ్ స్టార్, యాక్షన్ చిత్రాల హీరో సిల్వెస్టర్ స్టోలెన్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసు పెట్టింది ఆయన్ను అమితంగా ఇష్టపడే మహిళా అభిమాని కావడం గమనార్హం. 71 ఏళ్ల ఈ స్టార్ హీరోపై ఇలాంటి కేసు నమోదు కావడం చర్చనీయాంశం అయింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు లాస్ఏంజెల్స్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ ప్రతినిధులు వెల్లడించారు.
28 ఏళ్ల క్రితం స్టోలెన్ తనపై బలాత్కారం చేశాడని, ఈ విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించారని, అందుకే ఈ విషయాన్ని ఇంతకాలం బయట పెట్టలేదని బాధిత మహిళ పేర్కొన్నారు. ఆటోగ్రాఫ్ కోసం అతడి వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘాయిత్యం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలు కాలిఫోర్నియా రాష్ట్రంలోని బీచ్ సిటీ శాంటా మోనికా పోలీసుల నుండి లాస్ ఏంజెల్స్ పోలీసులకు అందాయి. ఈ మేరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు లాస్ ఏంజెల్స్ డిస్ట్రిక్ట్స్ అటార్నీ ప్రతినిధి గ్రెగ్ రిస్లింగ్ తెలిపారు.
సదరు మహిళపై సిల్లెవస్టర్ స్టోలెన్ కూడా తిరిగి కేసు పెట్టారు. తన క్లయింటుపై ఆమె తప్పుడు కేసు పెట్టిందని, ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సిల్వెస్టర్ స్టోలెన్ తరుపు న్యాయవాది మార్టిన్ సింగర్ పేర్కొన్నారు.