Naa Nuvve Movie Public Talk నా నువ్వే సినిమా పబ్లిక్ టాక్

2018-06-14 2,593

Kalyan Ram's Naa Nuvve premier show talk. Tamannaah's glamorous appearance is plus point in the movie
#NaaNuvvepremiershowtalk

నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి నటించిన రొమాంటిక్ ఎంటర్ లవ్ స్టోరీ నా నువ్వే. తమన్నా అందాలు, కళ్యాణ్ రామ్ కొత్త లుక్ తో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. 180 చిత్రంతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు జయేంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్స్, ట్రైలర్స్ లో తమన్నా, కళ్యాణ్ రామ్ మధ్య బలమైన కెమిస్ట్రీ చూపించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యుఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి, సినిమా ఎలా ఉంది అనే అంశాలు ఇప్పుడు చూద్దాం.
కళ్యాణ్ రామ్ ఇంతవరకు ప్రేమ కథ చిత్రాల్లో నటించింది లేదు. తొలిసారి తమన్నాతో రొమాంటిక్ మూవీలో నటించడంతో నా నువ్వే చిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
మిల్కి బ్యూటీ తమన్నా అండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమన్నాకు యువతలో భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్లుగానే తమన్నా టీజర్స్, ట్రైలర్స్ లో గ్లామర్ గా కనిపించింది. కళ్యాణ్ రామ్ తో కెమిస్ట్రీ అదిరిపోయి ఉంటుందనే భావన కలిగింది.
యుఎస్ ప్రీమియర్స్ నుంచి నా నువ్వే చిత్రాన్ని డివైడ్ టాక్ వస్తోంది. కెమెరామెన్ పనితనం, తమన్నా గ్లామర్ మినహా ఈ చిత్రంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు.
దర్శకుడు ఫస్ట్ హాఫ్ లోనే ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు. బలమైన సన్నివేశాలు రూపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రేమకథ చిత్రం అంటే అందులో హీరో, హీరోయిన్ల మధ్య ఆడియన్స్ ఆకట్టుకునే కెమిస్ట్రీ ఆశిస్తారు. తమన్నా లాంటి అందాల భామ హీరోయిన్ గా అయినా ఆ విషయంలో కూడా చిత్ర యూనిట్ విఫలం చెందింది.