Allu Arjun Keeps 3 Star Directors In Queue

2018-06-14 1,318

Allu Arjun finalising future projects. 3 crazy directors are in que for Allu Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో షాక్ ఎదుర్కొన్నాడు. తదుపరి చిత్రంతో తిరిగి పుంజుకోవాలని భావిస్తున్నాడు. ఆలస్యమైనా మంచి ప్రాజెక్ట్ టేకప్ చేయాలనేది బన్నీ ఆలోచన. అందుకే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ గురించి ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అందరూ అనుకుంటున్నట్లుగానే అల్లు అర్జున్ తదుపరి చిత్రం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి క్రేజీ దర్శకులని కూడా బన్నీ లైన్ లో పెట్టాడట. ఈ మూడు ప్రాజెక్ట్ ఒకే అయితే అల్లు అర్జున్ ఫాన్స్ కు పండగే.
నా పేరు సూర్య చిత్రం భారీ అంచనాలతో విడుదలై నీరుగార్చింది. ప్రేక్షకులని మెప్పించడంలో ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. బన్నీ మాత్రం ఆర్మీ మాన్ పాత్రలో అదరగొట్టేశాడు.
అల్లు అర్జున్, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో సినిమా రాబోతోందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం దాదాపుగా ఖారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఆ తరువాత తాను చేయబోయే ప్రాజెక్ట్స్ విషయంలో కూడా బన్నీ స్పీడు పెంచాడు. విక్రమ్ కుమార్ చిత్రం తరువాత మరో ఇద్దరు దర్శకులని కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు బన్నీ ఆసక్తి చూపిస్తున్నాడు.