టాటా టిగోర్ బజ్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

2018-06-13 186

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ విపణిలోకి సరికొత్త టిగోర్ బజ్ స్పెషల్ ఎడిషన్ కారును లాంచ్ చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారును తమ టిగోర్ స్టైల్‌బ్యాక్ కాంపాక్ట్ సెడాన్ ఆధారంగా రూపొందించి, ఆవిష్కరించింది. సరికొత్త టిగోర్ బజ్ ప్రారంభ ధర రూ. 5.68 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

టాటా మోటార్స్ తమ టిగోర్ స్టైల్‌బ్యాక్ సెడాన్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా, టిగోర్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పరిమిత సంఖ్యలో టిగోర్ బజ్ ఎడిషన్ మోడల్‌ను లాంచ్ చేసింది.

టాటా టిగోర్ రెగ్యులర్ మోడల్‌లోని ఎక్స్‌టి వేరియంట్ ఆధారంగా బజ్ ఎడిషన్ అభివృద్ది చేశారు. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఛాయిస్‌లో లభించే టిగోర్ బజ్ ఎడిషన్ కారును కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే ఎంచుకోవచ్చు.

Read more at: https://telugu.drivespark.com/four-wheelers/2018/tata-tigor-buzz-edition-launched-in-india-at-rs-5-68-lakh-ex-showroom-delhi/articlecontent-pf77563-012173.html