బావతో వివాహేతర సంబంధం తో భర్తను చంపిన భార్య

2018-06-13 1,274

బావతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఓ మహిళ పెళ్లైన ఆరు నెలలకే భర్తను కడతేర్చాలని చూసింది. తన అక్క భర్తతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. ఇటీవల భర్తలను చంపుతున్న లేదా భర్తలపై హత్యాయత్నం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో జరిగింది.
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన పోషయ్య పెద్ద కూతురు గాయత్రికి విజయవాడకు చెందిన శ్రీనుతో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. శ్రీనుది మెదక్ జిల్లానే. కానీ బతుకుదెరువు కోసం విజయవాడ వెళ్లారు. పోషయ్య చిన్న కూతురు జ్యోతి అప్పుడప్పుడు విజయవాడలోని అక్క ఇంటికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో తన బావ శ్రీనుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మరోవైపు, జ్యోతికి ఆరు నెలల క్రితం అశ్వరావుపల్లికి చెందిన రాజుతో పెళ్లయింది.
రాజుతో జ్యోతికి పెళ్లయినప్పటికీ, తనకు భర్తతో ఉండటం ఇష్టం లేదని, నీతోనే ఉంటానని బావతో ఆమె చెప్పింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న జ్యోతి మనసు బావ పైనే ఉంది. దీంతో రాజును చంపి తనను తీసుకు వెళ్లమని బావ శ్రీనుతో చెప్పింది. పలుమార్లు తన గోడును బావతో చెప్పుకుంది. దీంతో మరదలు జ్యోతి కోరిక మేరకు శ్రీను.. రాజును చంపాలని నిర్ణయించుకున్నాడు.
బావ శ్రీను, మరదలు జ్యోతిలు ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆమె మూడు నెలలుగా శ్రీనుతో 1500 సార్లు ఫోన్లో మాట్లాడింది. గత నెల 20న శ్రీను విజయవాడ నుంచి అశ్వరావుపల్లికి వచ్చాడు.ఊరి చివర పొదల్లో మరుగుదొడ్డి శుభ్రం చేసే యాసిడ్ బాటిల్ దాచిపెట్టాడు. అదే నెల 27న విజయవాడలో తనకు తెలిసిన వెంకట దుర్గారావు, మరో బాలుడికి రూ.20వేలు ఇస్తామని సుఫారీ మాట్లాడుకొని వారితో కలిసి అశ్వరావుపల్లికి వచ్చాడు.