Aakasamlo Aasala Harivillu Audio Launch Event

2018-06-12 1,218

Aakasamlo aasala harivillu Audio launch took place in hyderabad. directed by kranthi kranthi

ఈ సందర్బంగా నవ్యంద్ర ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఎస్ వి ఎన్ రావు మాట్లాడుతూ .. అచ్చమైన తెలుగు టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ట్రయిలర్ బాగుంది. మంచి కథతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చాలా సినిమాలు నిరూపించాయి. అలాగే నిర్మాత సత్య శ్రీ అన్ని విషయాల్లో ముందుండి ఈ సినిమాను నడిపించారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ సాధించి ఈ యూనిట్ కు మంచి విజయాన్ని అందివ్వాలి అన్నారు.
నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ .. మహానటి తరహాలో ఈ సినిమా నిర్మాత సత్య శ్రీ ముందుండి అన్ని పనులు చూసుకుంది. మహిళలు కూడా పలు రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణం. అలాగే చక్కని పేరుతొ వస్తున్నా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. హీరో హీరోయిన్లు చక్కగా ఉన్నారు. అలాగే మంచి టెక్నీకల్ టీమ్ కుదిరింది. ట్రైలర్ చాలా బాగుంది. తప్పకుండ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కురొకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు క్రాంతి కిరణ్ మాట్లాడుతూ .. రెండో చిత్రం . మొదటి సినిమాకూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన నిర్మాత సత్య శ్రీ గారికి ధన్యవాదాలు, కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన మంచి ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్నారు.