Priyanka Chopra has lately been hogging a lot of limelight for her 'blossoming' romance with singer Nick Jonas.
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడ్డట్లు వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు చిక్కడంతో అమెరికన్ మీడియాలో వీరి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. తాజాగా వీరి మధ్య ఉన్న 'సం'బంధానికి సంబంధించి మరిన్ని బలమైన సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. నిక్ ఫ్యామిలీలో జరిగిన వేడుకకు ప్రియాంక కూడా హాజరయ్యారు.
తన బాయ్ ఫ్రెండ్ నిక్ జోనస్‌తో కలిసి న్యూజెర్సీ ఎయిర్‌పోర్టులో ప్రియాంక మీడియా కెమెరాలకు చిక్కారు. నిక్ కజిన్ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఇద్దరూ కలిసి ఇక్కడికి వచ్చినట్లు యూఎస్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
న్యూజెర్సీ ఎయిర్‌పోర్టులో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ఒకరిచేతిలో ఒకరు చేయి వేసుకుని నడుచుకుంటూ వెళుతూ మీడియా దృష్టిని ఆకర్షించారు. తమ మధ్య ఉన్న సంబంధం గురించి అందరికీ తెలియాలనే ఇద్దరూ ఇలా చేసినట్లు తెలుస్తోంది.
నిక్ ప్రేమలో ప్రియాంక పీకల్లోతు ప్రేమలో మునిగి ఉందని, అతడి కోసం ఏం చేయడానికైన సిద్ధంగా ఉందని, ప్రస్తుతం ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారని అమెరికన్ మీడియాలో వార్తలు వచ్చాయి.