Star Maa Responds On Sri Reddy Comments

2018-06-12 4,408

Star maa responds on srireddy comments. Before they consider Srireddy name for Bigg Boss 2

బిగ్‌బాస్ 2లో శ్రీరెడ్డి ఎంపిక కాకుండా నాని అడ్డుకున్నాడనే వార్తల నేపథ్యంలో స్టార్ మా యాజమాన్యం స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. నాని టార్గెట్ గా శ్రీరెడ్డి దారుణంగా వ్యక్తిగత దూషణలు దిగుతున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ 2 కు నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. స్టార్ మా యాజమాన్యం ఎంపిక చేసిన 16 మంది కంటెస్టెంట్స్ తో ఇటీవల బిగ్‌బాస్ 2 షో ప్రారంభమైన సంగతి తతెలిసిందే. శ్రీరెడ్డి విషయంలో నానిపై వస్తున్న ఆరోపణలకు స్టార్ మా యాజామాన్యం క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
భారీ అంచనాలు, హైప్ తో ఇటీవల బిగ్‌బాస్ 2 ప్రారంభమైనది. దాదాపు 100 రోజులపాటు సాగె ఈ షోలో నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు గత సీజన్లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
బిగ్‌బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ కోసం ముంబై లోని బిగ్‌బాస్ టీం దాదాపు 125 మంది పేర్లని పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జాబితాలో శ్రీరెడ్డి పేరు కూడా ఉందట.
నానిపై వస్తున్న ఆరోపణలు నేపథ్యంలో స్టార్ మా క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నాని ప్రమేయం ఏమాత్రం లేదని అంటున్నారు. పరిశీలించిన వారందరి పేర్లని ఎంపిక చేయడం కుదరదు అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.