Master Bharath Going To Become A Friend To Allu Sirish

2018-06-11 1

Master Bharath completely changed his look. He is going to became friend to Allu Sirish

చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రభావం చూపి ఆ తరువాత హీరోలుగా, హీరోయిన్లుగా, క్యరెక్టర్ ఆర్టిస్టులుగా రాణించిన నటులు ఎందరో ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే అద్భుతమైన హాస్యాన్ని పండించిన మాస్టర్ భరత్ సినీ అభిమానులందరికి గుర్తుండే ఉంటాడు. పలు తెలుగు చిత్రాల్లో మాస్టర్ భరత్ నటించి మెప్పించాడు. మాస్టర్ భరత్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మాస్టర్ భరత్ మరో మారు తెలుగు తెరపైకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయాడు. అతడి ఎలాంటి పాత్రతో రాబోతున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
చైల్డ్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సమయంలో భరత్ బొద్దుగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు నూనూగు మీసాల యువకుడిగా స్టైలిష్ గా మారిపోయాడు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అతడి న్యూ లుక్ చూస్తే షాక్ కావలసిందే.
పోకిరి, వెంకీ, రెడీ, మిస్టర్ పర్ఫెక్ట్, రగడ, నమో వేంకటేశ వంటి విజయవంతమైన చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా భరత్ నటించాడు. కొంత కాలంగా భరత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
చైల్డ్ ఆర్టిస్టుగా హాస్యం పాడించిన భరత్ ఓ హీరోకి ఫ్రెండ్ గా నటించబోతున్నాడు. అల్లు శిరీష్ ప్రస్తుతం ఎబిసిడి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శిరీష్ కు భరత్ ఫ్రెండ్ గా పూర్తి స్థాయి పాత్రలో నటించనుండడం విశేషం. ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు.