Sehwag Talks About Sachin Tendulkar's Idea In World Cup

2018-06-11 255

In a chat show 'What the Duck', anchored by Vikram Sathaye, Sehwag - while talking about how Sachin didn't let him watch the entire final match - revealed, "He (Sachin) was sitting in front and I was facing the back side.


వరల్డ్ కప్ విన్నింగ్ షాట్.. ఏడేళ్ల క్రితం ధోనీ కొట్టిన సిక్స్ అది. దాంతో భారత జట్టుకు వన్డే ప్రపంచ కప్‌ ఖాయమైంది. 2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖేడే మైదానంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ధోని సిక్స్‌ కొట్టి భారత్‌కు వరల్డ్‌కప్‌ను ఖాయం చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోని 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో నాటౌట్‌గా నిలిచి (91) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ నాటి ధోనీ కీలక ఇన్నింగ్స్‌ వెనుక మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పాత్ర ఉందన్న విషయాన్ని సెహ్వాగ్ తాజాగా బయటపెట్టాడు.
సాధారణంగా ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. అయితే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ధోని ఒక స్థానం ముందుగా బ్యాటింగ్‌కు దిగాడు. యువరాజ్‌ సింగ్‌ రావాల్సిన ఐదో స్థానంలో ధోని బ్యాటింగ్‌కు వచ్చి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌తో వరల్డ్‌కప్‌ను అందించాడు. ఇలా, ధోనిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపడానికి సచినే కారణమట.
సచినే నేరుగా కలగజేసుకుని బ్యాటింగ్‌ ఆర‍్డర్‌ను మార్చాడట. ఈ విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్‌ తాజాగా స్పష్టం చేశాడు. అలా సచిన్‌ డైరెక్ట్‌గా ఎంఎస్‌ ధోనికి చెప్పడం తొలిసారని, అది మంచి ఫలితాన్ని ఇచ్చిందని సెహ్వాగ్‌ తెలిపాడు.

Free Traffic Exchange