చంద్ర బాబు పై నిప్పులు చెరిగిన ముద్రగడ

2018-06-11 1

Kapu leader Mudragada Padmanabham open letter to Jana Sena chief Pawan Kalyan and YSRCP chief YS Jagan Mohan Reddy other party leaders.
#MudragadaPadmanabham

రాజకీయ పార్టీలకు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఎందరో త్యాగాలతో మనకు విదేశీ పాలన పోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఏపీని సింగపూర్ పాలిత ప్రాంతంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలకు ఇస్తానని ప్రకటించిన జూన్ 7వ తేదీ ఏపీకి బ్లాక్ డే అన్నారు.
ఈ సందర్భంగా ముద్రగడ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజల ఆస్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత ఆస్తులుగా భావించి, సింగపూర్‌ కంపెనీలకు దానం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు జీవితంలో నిత్యం కష్టాలే ఉంటాయని, రైతుల పట్ల సానుభూతి చూపాల్సిన ప్రభుత్వమే వారిని కష్టాలపాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల కోసం అన్ని పార్టీల నేతలతో ఒకే వేదిక పైకి జగన్‌, పవన్‌ సమావేశం ఏర్పాటు చేయాలని ముద్రగడ కోరారు. రాష్ట్రాన్ని సింగపూర్‌ పాలిత ప్రాంతంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందరూ కలిసి రాష్ట్రాన్ని, రైతులను, సామాన్య ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరముందని హితవు పలికారు.