Actress Sudha Gets Emotional Talking About Uday Kiran. Sudha plays mother to Uday kiran in 9 movies
టాలీవుడ్ లో హీరోయిన్ కో, హీరోకు ఎవరైనా తల్లిపాత్రలో నటించాలి అంటే దర్శకనిర్మాతల మదిలో మొదట మెదిలే పేరు సుధ. దశాబ్దాల కాలం నుంచి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా చెరగని ముద్ర వేస్తున్నారు. ఇప్పటికి పలు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుధ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉదయ్ కిరణ్ తో ఆమెకు ఉన్నా సాన్నిహిత్యం గురించి సుధ వివరించారు.
తాను స్వతహాగా తమిళ మహిళని అని, తమిళనాడులోని శ్రీరంగంలో పుట్టి పెరిగానని సుధ అన్నారు. తనని సినిమాల్లోకి బాలచందర్ గారు పరిచయం చేసినప్పటికీ గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగు చిత్రాల ద్వారానే అని అన్నారు. ఎక్కువగా తెలుగు చిత్రాలు చేయడం వలన తెలుగింటి ఆడపడుచు అయిపోయానని సుధ తెలిపారు.
తనకు తెలుగులో బాగా నచ్చిన చిత్రాలు గ్యాంగ్ లీడర్, ఆమె. అతడు చిత్రాలు నచ్చుతాయని అన్నారు. ఆ చిత్రాల్లో సుధ కీలక పాత్రల్లో నటించారు.
తాను ఎక్కువగా ఉదయ్ కిరణ్ కు తల్లిగా నటించానని సుధ అన్నారు. 9 చిత్రాలలో తామిద్దరం తల్లి కొడుకులుగా నటించామని సుధ తెలిపారు. అందువలనే ఉదయ్ కిరణ్ తన కుటుంబంతో కంటే తనతో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉండేవాడని తెలుపారు. ఆ సాన్నిహిత్యం వలనే ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకోవాలనే ఆలోచన కూడా వచ్చినట్లు ఆమె తెలిపారు.