మృగశిరకార్తె సందర్భంగా ఆస్తమా కోసం బత్తిని గౌడ్ సోదరులు పంపిణీ చేయనున్న చేప ప్రసాదం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఇది ప్రారంభమైంది. శనివారం ఉదయం తొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది. చేప ప్రసాదం కోసం బెంగాల్, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఇప్పటికే ప్రజలు బారులు తీరారు.
ఈసారి లక్షన్నర మందికి పైగా చేప ప్రసాదం స్వీకరించేందుకు రావొచ్చని అంచనా. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ 133 ప్రత్యేక బస్సులను ఎగ్జిబిషన్ మైదానం వరకు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.