Bhuvneshwar kumar Talks About Cricketers

2018-06-08 353

The right-arm bowler who is one of India’s most successful bowler in recent times turned 28 on Monday.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ని మొట్టమొదటిసారి చూసినప్పుడు తాను ఏమీ మాట్లాడలేకపోయానని టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ వెల్లడించాడు. తాజాగా గౌరవ్ కపూర్ హోస్ట్‌గా వ్వవహారించిన 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే కార్యక్రమంలో భువనేశ్వర్ కుమార్ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా భారత జట్టులోని ఆటగాళ్లకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను భువీ పంచుకున్నాడు. భువీ మాట్లాడుతూ 'తొలిసారి సచిన్‌ టెండూల్కర్‌ను చూసినప్పుడు ఏమీ మాట్లాడలేకపోయా. దేశవాళీ మ్యాచ్‌ కోసం మైదానానికి వెళ్లేందుకు నేను గదిలో నుంచి బయటకు వచ్చాను. ఇంతలో ఎవరో వచ్చి గది తలుపు కొడుతూ ఉన్నారు' అని అన్నాడు.
ఎవరా? అని వెనక్కి తిరిగి చూస్తే సచిన్‌. మొదటిసారి సచిన్‌ను చూడటం అప్పుడే. ఇద్దరం కలిసి లిఫ్ట్‌ ఎక్కి కిందకు వెళ్తున్నాం. ఆ సమయంలో నాకు ఏం మాట్లాడాలో పాలుపోలేదు. సచిన్‌ మాత్రం నన్ను విష్‌ చేశాడు. అప్పుడు జరిగిన మ్యాచ్‌లో నేను సచిన్‌ను డకౌట్‌ చేశాను' అని భువనేశ్వర్ చెప్పుకొచ్చాడు.
భారత జట్టులో చోటు దక్కించుకున్న కొత్తలో తాను డ్రస్సెంగ్‌ రూమ్‌లో పెద్దగా ఏం మాట్లాడేవాడిని కాదని, చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవాడినని తెలిపాడు. అంతేకాదు తాను ఏదైనా చెప్పాల్సి వస్తే ఇషాంత్‌ శర్మకు చెప్పేవాడినని భువనేశ్వర్‌ తెలిపాడు. ఇక, టీమిండియాలో ఎవరు ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారో మీకు తెలుసా? అన్న ప్రశ్నకు భువీ స్పందించాడు.

Free Traffic Exchange