Director Kethireddy Jagadishwar Reddy Reveals Sensational Facts About Savitri

2018-06-07 4

Tollywood Director Kethireddy Jagadishwar Reddy Reveals Sensational Facts About Savitri Daughter Vijaya Chamundeswari. made comments on Mahanati.

'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమాతో వార్తల్లోకి ఎక్కిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మరో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. 'మహానటి' చూసిన ఆయన సావిత్రి గురించి, ఆమె కూతురు విజయ చాముండేశ్వరి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సావిత్రి, చాముండేశ్వరి మధ్య ఉన్న ఆస్తి వివాదాల వెనక ఉన్న అసలు కారణం ఏమిటి? వారి మధ్య ఎందుకు గొడవ జరిగింది? తన నగలు కూతురుకు దక్కకుండా సావిత్రి ఏం చేసిందనే వివరాలు బయట పెట్టారు.
నాకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడే సావిత్రితో పరిచయం ఉందని.... ‘మహానటి' సినిమా చూసిన తర్వాత మొదటి భాగంలో ఆమె జీవితంలోని యదార్ధ సంఘటనలు ఉన్నది ఉన్నట్లు చూపించారనే భావన కలిగిందని, సెకండాఫ్‌లో సినిమా జీవితానికి సంబంధించి చాలా వరకు కల్పితం ఉన్నట్లు తనకు అనిపించింది అన్నారు.
నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత చెన్నైలో సావిత్రి సొంత ఇంటికి వెళ్లడం జరిగేది. వెళ్లినపుడు కొన్ని సంఘటనలు నాకు తెలిసాయి. ఆ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సావిత్రి సినిమాల్లో సంపాదించిన డబ్బుతో తన కూతురు పేరు మీద కొన్ని ఆస్తులు కొనుగోలు చేసింది. ఆమె తాగుడుకు బానిసై తర్వాత ఆస్తులన్నీ పోయాయి. చివరకు చాముండేశ్వరి పేరు మీద ఉన్న ఆస్తి కూడా అమ్మాలని నిర్ణయించుకుంది. అయితే అప్పటికే పెళ్లయిన విజయ చాముండేశ్వరి, ఆమె భర్త గోవిందరావు ఆ ఆస్తిని అమ్మడానికి నిరాకరించారు. దీంతో సావిత్రి, విజయ చాముండేశ్వరి మధ్య గొడవలు మొదలయ్యాయి అని కేతిరెడ్డి తెలిపారు.