SriReddy controversial comments on Daggubati Rana. She made comments on Trisha also
ఆ మద్యన మీడియాలో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి కొంతకాలంగా టివి ఛానల్స్ లో కనిపించడం లేదు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ పై చేసిన దారుణమైన వ్యాఖ్యలతో తీవ్రమైన వివాదం చెలరేగింది. స్వయంగా పవనే రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. శ్రీరెడ్డిని హైలైట్ చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు కిక్కురుమనకుండా సైలెంట్ అయిపోయాయి. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటానికిముందు యూట్యూబ్ లో ఆమె బూతు ఇంటర్వ్యూలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ ఇంటర్వ్యూ గురించి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపేవిగా ఉన్నాయి. ఇది డర్టీ పిక్చర్ లాంటి ఇంటర్వ్యూ అని శ్రీరెడ్డి తెలిపింది. ఇందులో మా బావ రానా ప్రస్తావన కూడా ఉందని శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్.
ఆ ఇంటర్వ్యూ ప్రోమో సంచలనం రేపే విధంగా ఉంది. తాను ఇండస్ట్రీలో చేస్తున్నది వర్క్ కాదని వ్యభిచారమే చేస్తున్నా అని శ్రీరెడ్డి తెలిపింది. ఓ డిప్యూటీ సీఎం కొడుకు తన మాజీ బాయ్ ఫ్రెండ్ అని శ్రీరెడ్డి తెలిపింది.
శ్రీరెడ్డి ఈ ప్రోమోలు దగ్గుబాటి రానా గురించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది. ఓ పార్టీకి త్రిష, రానా ఇద్దరూ వచ్చారని శ్రీరెడ్డి తెలిపింది. త్రిషని చూసిన వెంటనే అంటూ శ్రీరెడ్డి చేసిన బూతు వ్యాఖ్యలు పేర్కొనలేని విధంగా ఉన్నాయి. పైగా బావగారు మీరు ఏమి అనుకోవద్దు అంటూ వ్యాఖ్యనించింది.