రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన ఏథర్

2018-06-06 568

మారుతున్న కాలానికి అనుగుణంగా నగర రవాణా వ్యవస్థను సరళతరం చేస్తూనే పర్యావరణానికి మేలు కలిగించే దిశగా ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారు చేసే స్టార్టప్ కంపెనీ ఏథర్ ఎనర్జీ సుధీర్ఘ ప్రయోగానంతరం మార్కెట్లో 340 మరియు 450 అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమ రూపు రేఖలు మార్చబోయే ఏథర్ 340 మరియు 450 స్కూటర్ల గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో... ఏథర్ ఎనర్జీ స్టార్టప్ కంపెనీ విడుదల చేసిన 340 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.09 లక్షలు మరియు 450 స్కూటర్ ధర రూ. 1.24 లక్షలు. రెండు ధరలు కూడా అన్ని పన్నులు, మినహాయింపులు మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలతో సహా ఆన్-రోడ్ ధరలుగా ఇవ్వబడ్డాయి. 340 మరియు 450 ఎలక్ట్రిక్ స్కూటర్లు చూడానిటికి ఒకేలా ఉంటాయి. అయితే, 450 స్కూటర్లోని చక్రాల మీద గ్రీన్ స్టిక్కరింగ్ ఉంటుంది. ఏథర్ ఎనర్జీ విపణిలోకి ప్రవేశపెట్టిన భారతదేశపు తొలి స్మార్ట్ ఎలక్ట్రి స్కూటర్ల తొలుత బెంగళూరులో మాత్రమే లభ్యమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇతర నగరాలకు విస్తరించనున్నారు.

Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/ather-340-450-electric-scooters-launched-in-india-price-specifications-features-images-more/articlecontent-pf77217-012137.html

#Ather340 #Ather340price #Ather340review #Ather340photo #Ather450 #Ather450price #Ather4502018 #Ather450photo

Free Traffic Exchange