స్పీకర్ ఓకే: 5గురు వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం!

2018-06-06 1

MP Mekapati Rajamohan Reddy said that Lok Sabha speaker Sumitra Mahajan on Wednesday approved YSRCP MPs resignations
#mekapatirajamohanreddy
#yvsubbareddy
#midhunreddy
#Loksabha
#chandrababunaidu

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు! ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారం మీడియాకు తెలిపారు. లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తమ రాజీనామాలను ఆమోదించారని ఆయన వెల్లడించారు. అలాగే, పార్టీ మారిన మరో ముగ్గురు తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు తెలిపారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు (బుధవారం) సాయంత్రం లేదా రేపు (గురువారం) ఉదయం వెలువడవచ్చునని తెలుస్తోంది. ఎంపీలు మాత్రం తమ రాజీనామాలు ఆమోదించినట్లు తెలిపారు.