రెస్టారెంట్‌లో షాకింగ్‌ ఘటన..!

2018-06-06 150

కంపెనీలు ఏవైనా.. కారణాలు ఏమైనా సరే... తరచూ వార్తల్లో మనం సెల్‌ఫోన్లు పేలిపోతున్న ఘటనలు చూస్తున్నాం. ఛార్జింగ్ పెట్టినప్పుడో, లేక ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నపుడో... అంతేందుకు జేబులో పెట్టుకున్నా పేలిపోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకోగా, అది సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.
భాందప్‌ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో ఈ నెల 4వ తేదీన ఓ వ్యక్తి లంచ్‌ చేస్తున్నాడు. ఇంతలో పైజేబులో ఉన్న ఫోన్‌ నుంచి పొగలు రావటం ప్రారంభింది. అయితే అప్రమత్తమైన ఆ వ్యక్తి జేబులోంచి దాన్ని విసిరేసి దూరంగా జరిగాడు. అంతలో అది పేలిపోయింది. ఆ ఘటనతో ఒక్కసారిగా రెస్టారెంట్‌లోని మిగతావారు బయటకు పరుగులు తీశారు. స్వల్ఫ గాయాపాలైన ఆ వ్యక్తి తర్వాత చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. కాగా, ఈ ఫోన్ ఏ కంపెనీది అన్న వివరాలు తెలియదు. రెస్టారెంట్‌లోని సీసీ టీవీ ఫుటేజీలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి.