R U Married ??Movie Audio Launch Happened In Hyderabad.Mourya.sree khar,avanthika Played main Roles
మౌర్య , చరిష్మా హీరో హీరోయిన్లుగా సెవెన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రం గా నిర్మిస్తున్న సినిమా '' ఆర్ యు మ్యారీడ్ ?'' .రొమాంటిక్ లవ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అళహరి దర్శక నిర్మాత. ఫిలిం ఛాంబర్ లో ప్రారంభమైన ఈ సినిమా వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. హీరో హీరోయిన్ ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ క్లాప్ నివ్వగా ,,ప్రవాస భారతీయుడు చిట్టిమల్ల రఘు కెమెరా స్విచ్ ఆన్ చేసారు..
ఈ సందర్భంగా దర్శక నిర్మాత అళహరి మాట్లాడుతూ '' ఎవరి ఊహలకు అందని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను..గ్రాఫిక్ వర్క్‌తో భారీ బడ్జెట్‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 23 నుండి ప్రారంభం అవుతుంది. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకుల భావోద్వేగాలను, ప్రసుత జనరేషన్ లైఫ్ స్టైల్ ని ఈ సినిమా ద్వారా చూపించనున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతి లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని'' చెప్పారు.