Sri Reddy Severe Comments On Chiranjeevi

2018-06-05 2

SriReddy controversial comments on Pawan Kalyan and Chiranjeevi. I did not get MAA memebership only because of Pawan Kalyan she says
#SriReddy
#PawanKalyan
#Chiranjeevi

పవన్ కళ్యాణ్ తల్లినే దూషిస్తూ చేసిన దారుణమైన వ్యాఖ్యలు, దానిపై కొన్ని మీడియా సంస్థలు నడిపిన డిబేట్లు అందరూ గమనించారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ దాడితో ఆయా మీడియా ఛానల్స్ సైలెంట్ అయిపోయాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి మరో మారు సంచలన వ్యాఖ్యలు చేసింది.
పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరిపై శ్రీరెడ్డి సెటైర్లు వేసింది. చిరు గత రాజకీయ అనుభవాన్ని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసింది. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేరిన పోస్ట్ లో ఎక్కువగా రాజకీయ అంశాలు ప్రస్తావించింది.
మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికయ్యాడు. కేవలం ఒక్కసారి మాత్రమే తిరుపతికి వచ్చాడు. తిరుపతి ప్రజల కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు అని ఇక్కడ వారు అనుకుంటున్నట్లు శ్రీరెడ్డి తెలిపింది. తిరుపతిలో జరిగిన అభివృద్ధి మొత్తం చంద్రబాబు చేసినదే అని శ్రీరెడ్డి తెలిపింది.
సినిమాల్లో మీ అన్న ఎంతమందిని అణగదొక్కాడో మాకు తెలియదా అంటూ శ్రీరెడ్డి చిరుని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
పవన్ కళ్యాణ్ పై ఉన్న గౌరవంతోనే మా అసోసియేషన్ వారు తనకు సభ్యత్వం ఇవ్వడం లేదని శ్రీరెడ్డి ఆరోపించింది. సినిమా డైలాగులు కొట్టి మంచి నీళ్లు తాగినంత సులభం కాదు రాజకీయాలు అంటూ శ్రీరెడ్డి సెటైర్ వేసింది.