Chittoor MP and Telugudesam Party leader Siva Prasad said that PM Narendra Modi conspiracy in AP with the help of Jagan and Pawan Kalyan.
#shivaprasad
#pawankalyan
#narendramodi
#kesineninani
#ysjaganmohanreddy
#vijayawada
#chittoor
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ శివప్రసాద్ మంగళవారం ఆరోపించారు. మనకు స్వచ్ఛ భారత్ కావాలని చెబుతారని, కానీ మోడీ మాత్రం స్వచ్ఛంగా ఉండరని మండిపడ్డారు.
మూడేళ్లుగా రాజీనామాలు చేస్తామని చెబుతున్న వారు, ఇటీవల రాజీనామాలు చేసి, కొద్ది రోజుల క్రితం స్పీకర్‌ను కలిసి తమకు స్పీకర్ మరో వారం రోజుల పాటు గడువు ఇచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజీనామాలు చేస్తే ఎన్నికలు రావనేదే వారి వ్యూహమన్నారు. రాజీనామాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రజల చెవుల్లో పూవులు పెడుతున్నారన్నారు.