Captain Sunil Chhetri scored a brace on his 100th international game as Jeje Lalpekhlua also got on the scoresheet to help India outclass Kenya 3-0 and put one foot in the final of the Intercontinental Cup on a rain-soaked Monday night at the Mumbai Football Arena.
#intercontinentalcup
#sunilchhetri
#stephenconstantine
#football
ఎడతెరిపిలేని వర్షం మైదాన్నంతా ముంచేసినా.. వేగం తగ్గించుకోకుండా.. విజయకాంక్ష చల్లార్చుకోకుండా పోరాడి నిలిచింది భారత్. అంతకుముందు టీమిండియా కెప్టెన్ సునీల్ ఛెత్రి చేసిన అభ్యర్థనకు స్పందించిన భారత క్రీడాభిమానులు స్టేడియమంతా నిండిపోయారు. దీంతో ఎన్నడూ లేని రీతిలో ఫ్యాన్స్ రావడంతో ఫుట్‌బాల్ ఎరీనా కొత్త రూపు సంతరించుకుంది. సోమవారం కెన్యాతో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో ఆతిథ్య భారత్ 3-0 తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 7న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఛెత్రి (68వ, 90వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. జెజె లాల్‌పెక్లుయా (71వ) మరో గోల్ చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో టీమిండియా దాదాపు ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. భారీ వర్షం మధ్య సాగిన మ్యాచ్‌లో.. ఆట ఆరంభం నుంచే భారత్ అటాకింగ్ గేమ్ ఆడింది. కొన్ని అవకాశాలను సృష్టించుకున్నా గోల్‌గా మలచలేకపోయింది.