బిగ్‌బాస్7లో వివాదాస్పద సెలబ్రిటీగా పేరు తెచ్చుకొన్న అర్మాన్ కోహ్లీపై క్రిమినల్ కేసు నమోదైంది. తన గర్ల్‌ఫ్రెండ్ నీరూ తలను నేలకు బలంగా కొట్టడంతో ఆమె హాస్పిటల్ పాలైంది. ఆమె ప్రస్తుతం చికిత్సనందిస్తున్నారు. ఈ కేసులో అర్మాన్‌పై పోలీసులు దాడి కేసు రిజిస్టర్ చేశారు. దాడికి కారణాలను నీరూ మీడియాకు వెల్లడించారు. ఈ వ్యవహారంలో అసలు ఏమైందంటే..
గోవాలో అర్మాన్‌కు ఓ విల్లా ఉంది. దాని అద్దె వ్యవహారాలను నేను చూసుకొంటాను. విల్లాను ఓ క్లయింట్‌కు ఇచ్చిన అద్దె విషయంపై మా మధ్య వాగ్వాదం జరిగింది. అద్దెకు తీసుకొన్న క్లయింట్ ఆ మొత్తాన్ని మా సిబ్బందికి అందజేశారు. ఆ డబ్బు గురించి అర్మాన్ ఆరా తీయగా, సిబ్బంది ట్రాన్స్‌ఫర్ చేయలేదు. డబ్బు ట్రాన్స్‌ఫర్ కాగానే ఇస్తాను అని చెప్పాను.
అద్దె విషయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నన్ను దుర్భాషలాడారు. అ కారణంగా నా జుట్టు పట్టుకొని నేలకు కొట్టారు. దాంతో తలకు తీవ్ర గాయమైంది. రక్తం కారుతుండటంతో నన్ను హాస్పిటల్‌లో చేర్పించమని ప్రాధేయపడ్డాను. పోలీసులకు ఫిర్యాదు చేయనని చెప్పాను. అయినా నన్ను పట్టించుకోలేదు. ఎలాగోలా ఆస్పత్రిలో చేరాను.
తలకు బలమైన గాయం కావడంతో సర్జరీ చేశారు. దెబ్బ బలంగా తాకడంతో చర్మం బాగా చిట్లిపోయింది. గాయం మానిన తర్వాత కూడా తలపై మరక ఉంటుందని డాక్లర్లు చెప్పారు. ఇంతా జరిగిన తర్వాత ఇంటికి రా. వెంటనే పెళ్లి చేసుకొందామని ఎస్సెమ్మెస్ పంపుతున్నారు. అర్మన్‌తో జరిగింది చాలూ.. ఇక ఆ రిలేషన్‌కు పుల్‌స్టాప్ పెట్టాలనుకొంటున్నాను అని నీరూ వెల్లడించింది.