Rajinikanth speech at Kaala movie Hyderabad Pre Release Event

2018-06-05 9,171

Rajinikanth speech at Kaala movie Hyderabad Pre Release Event. Kaala film written and directed by Pa. Ranjith and produced by Dhanush. Starring Rajinikanth in the lead role, released on 7th June 2018. The film will be released in Tamil, Telugu, Malayalam, Nepali, Hindi and Assamese.
రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో, ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన 'కాలా' జూన్ 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం సాయంత్రం పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు రజనీకాంత్, ధనుష్, హుమా ఖురేషి, ఈశ్వరి, దర్శకుడు పా రంజిత్, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ప్రసంగం ఆకట్టుకుంది.
1978లో నా తొలి తెలుగు సినిమా ‘అంతు లేని కథ' విడుదలైంది. దాని తర్వాత పది నుండి 20 చిత్రాలు తెలుగులో చేశాను. అటు తమిళంలో చేస్తూ తెలుగు సినిమాలు కూడా చేయడంతో రెండు ప్రాంతాల్లో మంచి పేరు వచ్చింది. తమిళ సినిమాలపై కాన్సట్రేట్ చేయాలా? తెలుగు సినిమాలపై కాన్సట్రేట్ చేయాలా? అనే పెద్ద అయోమయం ఉండేది. బాలచందర్ గారి వల్ల తమిళంలో నా కెరీర్ మొదలైంది కాబట్టి తమిళంలో నా కెరీర్ కంటిన్యూ అయింది... అని రజనీకాంత్ తెలిపారు.
నా కెరీర్ మొదటి నుండి తమిళ ప్రేక్షకులు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారు. అది నాకు దక్కిన భాగ్యంగా భావిస్తాను. తెలుగులో కొంత గ్యాప్ తర్వాత మోహన్ బాబు తను తీస్తున్న పెదరాయుడు సినిమాలో నన్ను తీసుకున్నారు. దాని తర్వాత భాషా, ముత్తు, అరుణాచలం, చంద్రముఖి, రోబో, శివాజీ అలా వరుసగా నా సినిమాలు తెలుగులో మంచి ఆదరణ పొందాయి.... అని రజనీ వ్యాఖ్యానించారు.