Priyanka Chopra Gets Comments From Tweeters On Quantico

2018-06-04 4,156

The latest episode of Priyanka Chopra starrer Quantico has not gone down well with a lot of Indians as the plot show Indian nationals plotting to blow up Manhattan, New York, just to frame it on so that the neighbouring country can look bad in front of the United States and the world. Also, several people took offence with the term 'Indian nationalists' used on the show and took to Twitter slamming Priyanka Chopra and Quantico.
#Quantico
#PriyankaChopra

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సీరిస్ 'క్వాంటికో'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఏపిసోడ్లో ప్రసారం అయిన సీన్లపై భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించిన ఈ టీవీ సిరీస్‌లో అభ్యంతరకరంగా ఉన్న సీన్ గురించి ఆదిత్ కపాడియా అనే వ్యక్తి ట్విట్టర్లో వెల్లడించారు.‘తాజా ఎపిసోడ్లో ప్రియాంక చోప్రా ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఓ టెర్రరిస్ట్ మెడలో రుద్రాక్షమాల కనిపిస్తుంది. దాని ఆధారంగా వారు ఇండియన్స్ అని నిర్దారణకు వస్తారు. పాకిస్థాన్ టెర్రరిస్టుల ముసుగులో ఇండియన్సే పేలుళ్లకు ప్లాన్ చేశారు అనే విధంగా సీన్లో చూపించారు' అని వెల్లడించారు. టీవీ షో అయినప్పటికీ భారతీయులను ఇలా చిత్రీకరించే ప్రయత్నం చాలా దారుణమని, దీని వల్ల అమెరికన్లలో భారతీయులపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
భారతీయులను తప్పుడుగా చిత్రీకరిస్తున్న క్వాంటికో లాంటి టీవీ సిరీస్‌లో నటిస్తున్న ప్రియాంకను చూస్తుంటే సిగ్గేస్తుంది.... అంటూ కొందరు ట్విట్టర్ ద్వారా మండి పడ్డారు.
మరో వ్యక్తి తను చేసిన కామెంటుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ట్యాగ్ చేస్తూ... ఇండియాను డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.
ఈ వివాదాస్పద సీన్ మీద ట్విట్టర్లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. మనం కలిసికట్టుగా లేనపుడు ఇతరులను అని ఏం లాభం అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.
భారతీయులను దోషులుగా చిత్రీకరిస్తూ క్వాంటికో లాంటి టీవీ సీరిస్‌లో సీన్లు పెట్టడం, ఇలాంటి వాటిలో భారతీయురాలైన ప్రియాంక చోప్రా నిరభ్యంతరంగా నటించడం దారుణమని, ఇది సరైంది కాదు అనేకామెంట్స్ వినిపిస్తున్నాయి.