Rana Daggubati Haathi Mere Saathi Movie Name Confirmed In Telugu,Tamil

2018-06-04 347

Rana Daggubati starrer Haathi Mere Saathi, directed by Prabhu Solomon, will be released in Hindi,Tamil and Telugu.

బాహుబలి‌తో సూపర్ సక్సెస్‌ను అందుకొన్న రానా దగ్గుబాటి వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకొంటున్నారు. బాలీవుడ్‌లో హాథీ మేరే సాథీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో విలక్షణమైన పాత్రను రానా పోషిస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర తెలుగు, తమిళ టైటిల్స్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
హిందీ సూపర్‌స్టార్, స్వర్గీయ రాజేష్ ఖన్నా నటించిన హాథీ మేరే సాథీ సినిమా టైటిల్‌‌తో రానా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో అరణ్య, తమిళంలో కాదన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
హాథీ మేరే సాథీ చిత్రంలో రానా మావటిగా కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం చాలా బరువు తగ్గానని ఇటీవల రానా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విశేషంగా ఆకట్టుకొన్నది. ఈ చిత్రం వన్యప్రాణి సంరక్షణ కథాశంగా రూపొందున్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో ఏనుగులది కీలకపాత్ర అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
అరణ్య చిత్రంలోని పాత్ర కోసం రానా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. దాదాపు 15 రోజులపాటు సుమారు 18 ఏనుగుల మధ్య గడిపాడు. ఏనుగులను మచ్చిక చేసుకొనేందుకు విపరీతంగా శ్రమించారని చిత్ర యూనిట్ పేర్కొన్నది. దేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టాల సమస్యలెత్తే అవకాశం ఉన్నందున ఈ చిత్ర షూటింగ్‌ను దాదాపు థాయ్‌లాండ్‌లో జరిపారు.