Opener Mithali Raj's unbeaten 97 followed by medium pacer Pooja Vastrakar's 3/6 helped India register a convincing 142-run victory over hosts Malaysia in a Women's T20 Asia Cup cricket tie at the Kinrara Academy Oval on Sunday.
#india
#malaysia
#cricket
#mithaliraj
మహిళల టీ20 ఆసియాకప్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుతూ భారీ విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ 69 బంతుల్లో (13 ఫోర్లు, 1 సిక్స్)లతో కలిపి 97 నాటౌట్‌గా మెరుపులు మెరిపించడంతో.. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో మలేసియాను చిత్తు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. 35 పరుగులకే మందన (2), వస్ట్రార్కర్ (16) ఔటైనా.. మిథాలీ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది. పసలేని ప్రత్యర్థుల బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ పరుగుల వరద పారించింది. హర్మన్‌ప్రీత్‌తో కలిసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించిన మిథాలీ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.చివర్లో దీప్తి శర్మ (18) నాటౌట్ కూడా చెలరేగడంతో నాలుగో వికెట్‌కు అజేయంగా 48 పరుగులు జతయ్యాయి.