Rohit Sharma Throws Historic First Pitch In Baseball Game

2018-06-04 76

Rohit Sharma became the first Indian cricketer to throw the ceremonial 'first pitch' in Major League Baseball on Sunday.
#rohitsharma
#cricket
#ipl2018
#mumbaiindians
#baseball

దాదాపు రెండు నెలల పాటు సాగిన క్రీడా సంరంభం ఐపీఎల్ అనంతరం దాదాపు ఆటగాళ్లందరూ విదేశాలకు చెక్కేశారు. ఈ క్రమంలోనే భార్యతో కలిసి రోహిత్ శర్మ అమెరికా చేరుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ అరుదైన అవకాశాన్ని కొట్టేశాడు. అమెరికాలో సుప్రసిద్ధ 'మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌'లో భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మకు పాల్గొనే అవకాశం దక్కింది. ఆ లీగ్‌లో ఆడే సియాటెల్‌ మారినర్స్‌ జట్టు తరఫున అతను 'ఫస్ట్‌ పిచ్‌' చాన్స్‌ కొట్టేశాడు. ఈ మేరకు భారత స్టార్‌ క్రికెటర్‌ను సియాటెల్‌ జట్టు ఆహ్వానించింది.
సాఫెకొ ఫీల్డ్‌లోని మారినర్స్‌ హోమ్‌ గ్రౌండ్‌లో ప్రారంభోత్సవ మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ 'ఫస్ట్‌ పిచ్‌'తో బేస్‌బాల్‌ మ్యాచ్‌ మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంటకు ఈ మ్యాచ్‌ మొదలవుతుంది. మ్యాచ్‌ ముందు బేస్‌బాల్‌ను విసరడమే 'ఫస్ట్‌ పిచ్‌' అంటారు.