దేశీయ దిగ్గజ పురాతణ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ విపణిలోకి తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 బైకును విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 బైకు ధర రూ. 2.49 లక్షలు ఆన్-రోడ్(మహారాష్ట్ర)గా ఉంది.
రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. అందులో ఇండియాలో కేవలం 250 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. జూలై 10, 2018 నుండి రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 బైక్ విక్రయాలు ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతాయి.
రెండవ ప్రపంచ యుద్ద కాలంలో బ్రిటీష్ సైనికులు ఉపయోగించిన ఫ్లైయింగ్ ఫ్లీ బైకు ప్రేరణతో రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త పెగాసస్ 500 లిమిటెడ్ ఎడిషన్ బైకును అభివృద్ది చేసింది. RE/WB 125 2-స్ట్రోక్ బైకు ఫ్లైయింగ్ ఫ్లీ పేరుతో బాగా సుపరిచతం.
Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/royal-enfield-pegasus-500-launched-india-priced-at-rs-2-40-lakh-ex-showroom-delhi/articlecontent-pf77059-012120.html