Sri Reddy Tweets To Nagarjuna Regarding Officer Movie

2018-06-04 1

SriReddy says officer movie is black buster. Sri Reddy tweet goes viral

రాంగోపాల్ వర్మ, నాగార్జున సూపర్ హిట్ కాంబినేషన్ లో చాలా కాలం తరువాత వచ్చిన చిత్రం ఆఫీసర్. జూన్ 1 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్మ చిత్రాలు ఈమధ్య కాలంలో సరిగా రాణించడం లేదు. కానీ నాగార్జునతో సినిమా అనేసరికి ఆయన ఫాన్స్ కాస్తో కూస్తో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఆఫిసర్ ఆ అంచనాలని కూడా పూర్తిగా నీరుగార్చేసింది.
వర్మ తెరకెక్కిస్తున్న చిత్రాలు వరుసగా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. కానీ వర్మ ఎప్పుడైనా మ్యాజిక్ చేయకపోతడానే అనే ఆశ ఆయన ఫాన్స్ లో ఉండేది. ఆఫీసర్ చిత్రంతో కూడా రాంగోపాల్ వర్మ తన పంథా మార్చుకోకపోవడంతో ఆడియన్స్ ఆ సినిమా వంక చూడడం కూడా మానేశారు.
ఆఫీసర్ చిత్రం బాగాలేకపోగా అభిమానుల్లో అసహనాన్ని పెంచే విధంగా ఉంది. పెరుగుతున్న నెగిటిక్ టాక్ తో ఈ చిత్రం వసూళ్లు దారుణంగా ఉన్నాయి. స్టార్ హీరో అని చెప్పబడే ఈ హీరోకి కూడా ఇంత దారుణంగా వసూళ్లు ఉండవు.