నిఫాకు మరో ఇద్దరు బలి: కేరళలో 16కి చేరిన మృతుల సంఖ్య!..

2018-06-02 167

With two more Lives being reported within the last two days in Kerala's Kozhikode, the toll from Nipah virus has risen to 16. State Health Minister K K Shailaja has also warned of a possible second outbreak.
#nipha
#virus
#kerala
#kozhikode

నిఫా కారణంగా కేరళలో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత రెండు రోజుల్లో మరో ఇద్దరు నిఫా కారణంగా మరణించడంతో మృతుల సంఖ్య 16కి చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ 'మనమంతా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం' అంటూ ఆమె కామెంట్ చేశారు. నిఫాను అరికట్టేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిఫా అనుమానిత కేసులు, నిఫాతో బాధపడుతున్నవారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు టెస్టుల రిపోర్టులు బయటపెడుతామన్నారు. కోజికోడ్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ కంట్రోల్ రూమ్ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు. వైద్య సిబ్బంది సైతం జాగ్రత్తలు తీసుకోవాలసి సూచిస్తున్నారు. నిఫాతో ఇద్దరు పేషెంట్స్ చనిపోయిన ఆసుపత్రిలో.. నలుగురు డాక్టర్లు, నర్సులను వారం రోజులు లీవుపై పంపించారు.

Free Traffic Exchange

Videos similaires