KL Rahul is ready to don the gloves if need be when India host Afghanistan in their one-off Test match from June 14 in Bengaluru. India's regular Wriddhiman Saha is suffering from a thumb injury and is almost certain to miss the match.
#klrahul
#india
#afghanistan
#cricket
#wriddhimansaha
సాహా స్థానంలో కీపింగ్ చేసేందుకైనా సిద్ధమేనంటున్నాడు కేఎల్ రాహుల్. అఫ్గానిస్థాన్‌తో జూన్ 14 నుంచి బెంగళూరు వేదికగా జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు సాహా అందుబాటులో ఉంటాడనేది సందేహం. ఈ క్రమంలో వికెట్ కీపింగ్ చేసేందుకు తాను సిద్ధమని భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. ఫైనల్‌కి ముందు గాయపడిన విషయం తెలిసిందే.
మ్యాచ్ జరుగుతుండగా అతని కుడిచేతి బొటనవేలు విరగడంతో ఆరోగ్యం సహకరించకపోవచ్చని బీసీసీఐ వెల్లడించింది. అయితే.. సాహా స్థానంలో జట్టులోకి దినేశ్ కార్తీక్, పార్థీవ్ పటేల్, రిషబ్ పంత్‌లో ఎవరో ఒకరిని తీసుకుంటారనే వివరాలు స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జట్టు మేనేజ్‌మెంట్ కోరితే తాను వికెట్ కీపింగ్ చేసేందుకు సిద్ధమని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.